పల్లవి
[అతడు] కన్నులు తెరిచే కలగంటామని ప్రేమికులంటుంటే
అయ్యో పాపం పిచ్చేమో అని అనుకున్నాను
కాని ఇప్పుడు
పగలే వెన్నెల కాస్తుందంటూ ప్రేమికులు అంటుంటే
అయ్యో పాపం మతిపోయిందని అనుకున్నాను
కాని ఇప్పుడు ప్రేమకోసం ఏకంగా తాజ్ మహల్ కట్టాడు
షాజహాన్‌కి పని లేదా అనుకున్నాను
ప్రేమ కన్నా లోకంలో గొప్పదేది లేదంటే
చెవిలో పువ్వే పెట్టారనుకున్నాను
అరె ఇంతలో ఏందేందో జరిగిందిరో
ఈ ప్రేమలో నేను కూడా తడిశానురో ||కన్నులు||
చరణం 1
[అతడు] ప్రేయసి ఊహల్లో లైఫంతా గడిపేస్తూ అరచేతికి స్వర్గం
అందిందంటే తిట్టుకున్నాను
కాని ఇప్పుడు
మీటింగ్ పార్కులకి, సెల్‌ఫోన్ బిల్లులకి వచ్చే జీతం సరిపోదంటే
నవ్వుకున్నాను
కాని ఇప్పుడు
గాలిలోన రాతలు రాస్తే మాయరోగం అనుకున్నాను
మాటి మాటికి తడబడుతుంటే రాతిరిదింకా దిగలేదనుకున్నాను
హొ హొ హొ అది ప్రేమని ఈరోజే తెలిసిందిలే
ఓ ఓ ఓ ఈప్రేమలో నే కూడా కలిశానురో ||కన్నులు||
చరణం 2
[అతడు] చూపుల్తో మొదలై గుండెల్లో కొలువై తికమక పెట్టే ఒకటుందంటే
నమ్మనే లేదు
కాని ఇప్పుడు
నీ కోసం పుట్టి నీ కోసం పెరిగే హృదయం ఒకటి
ఉంటుందంటే ఒప్పుకోలేదు
కాని ఇప్పుడు
ప్రేమమైకం అని ఒక లోకం ఉంది అంటే లేదన్నాను
ఇంతకాలం ఈ ఆనందం నేనొక్కడ్నే ఎందుకు మిస్సయ్యానుక
హొ హొ హొ ఈరోజులా ఏ రోజు అవలేదురో
ఓ ఓ ఓ ఈ ప్రేమలో నేకూడా తడిశానురో ||కన్నులు||