ఓరుగల్లుకే పిల్లా పిల్లా వెన్నుపూస

పల్లవి

[అతడు] ఓరుగల్లుకే పిల్లా పిల్లా వెన్నుపూస గల్లు గల్లుమన్నాదే
ఓరచూపులే రువ్వే పిల్లా ఏకవీర నువ్వులా ఉన్నావే ||2||
యవ్వనాల ఈ మధుబాల ||2|| ఇవి జగడాల ముద్దు పగడాల
అగ్గివీర ఆడగుగ్గిలాల చిందులేస్తున్నా చిత్తరాంగిగా ||ఓరుగల్లుకే||


చరణం 1


[ఆమె] లా లా లా పండు వెన్నెలా తొలివలపు పిలుపులే వెన్నలా
ఇకనైనా కలనైనా యెదకు చేరగలనా
[అతడు] అందాల దొండపండుకు మిసమిసల కొసరు కాకికెందుకు
అదికిడా సరిజోడా తెలుసుకొనవే తులసి
[ఆమె] చెలి మనస్సును గెలిచిన వరుడికి నరుడికి పోటి ఎవరు ||2||
చలి చెడుగుకు విరుగుడు తప్పేమి కావు తిప్పలు చాలు ||ఓరుగల్లు...||


చరణం 2


[అతడు] కా కా కా కస్సుబుస్సులా తెగ కలలు గనకు గోరువెచ్చగా
కలనిండా మునిగాకా తమకు కలదు వణుకు
[ఆమె] ద ద దమ్ములున్నవా మగసిరిగా ఎదురు పడగలవా లంకేశా
లవ్ చేశా రాముడంటి జతగాడ్ని
[అతడు] యెద మురిసిన మసకల మకమకలాడిన మాయే తెలుసా
ఒడిదుడుకులు ఉడుకులు ఈ ప్రేమకెన్ని తిప్పలు ||ఓరుగల్లుకే||