పల్లవి
[ఆమె] సొగసు చూడతరమా అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమా
మనస్సు నాపతరమా రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమా
నాకళ్ళల్లో వాకిళ్ళల్లో ఉయ్యాలలూగే ప్రేమా
సువ్వి సువ్వి సువ్వాలమ్మా చిందులేసి చూడవమ్మా
వయస్సు నాపతరమా సువ్వి సువ్వి సువ్వాలమ్మా నాలో నేను లేనోయమ్మా
ప్రేమ వింత వరమా ||సొగసు||
చరణం 1
[ఆమె] ఓ చల్లగాలి ఆ నింగిదాటి ఈ పిల్లగాలి వైపు రావా
ఊహలో తేలి నీ ఒళ్ళో వాలి నా ప్రేమ ఊసులాడనీవా
పాల నురుగులపైనా పరుగులు తీసి పాలు పంచుకోవా
పూల మధురిమకన్నా మధురము కాదా ప్రమగాధ వినవా ||సొగసు||
చరణం 2
[ఆమె] డోలారే డోలా డోలారే డోలా మోగింది చూడు గట్టిమేళా
బుగ్గే కందేలా సిగ్గే పడేలా నాకొచ్చేనమ్మా పెళ్ళికలా
మబ్బు పరుపుల మాటు మెరుపుల మేళ పంపెనమ్మా వాన
నన్ను వలచిన వాడు వరుడై రాగా ఆదమరచిపోనా ||సొగసు||