అమ్మో అమ్మమ్మ తోడు

పల్లవి

[అతడు]అమ్మో అమ్మమ్మ తోడు ఏదో అవుతుంది నాకు ఏందే ఇది
[ఆమె]రారా బంగారుస్వామి ఏమి కంగారు లేదు ప్రేమే ఇది
[అతడు]నిన్ను కోరూన్న కన్ను వేసుకున్న అన్ని చూసుకున్న నిన్ను చేరుకున్న
[ఆమె]బొట్టు పెట్టుకున్న కాటుకెట్టుకున్న పూలు చుట్టుకున్న నీకై చేచివున్న
||అమ్మో అమ్మమ్మ||

చరణం 1

[అతడు]అన్నం తింటున్న నేను కూరలేక అమ్మతోడు ఏది గుర్తులేక
[ఆమె]కన్ను మూసినగాని కునుకురాక ఎన్నో రోజులాయె ఎందుకంట
[అతడు]అవునులే ప్రేమిదే ప్రేమిదే ప్రేమిదే
[ఆమె]నీకై లడ్డూలు ఎన్నో చేసినాను ఉట్టిమీద పెట్టి ఉంచినాను
[అతడు]మొన్న అంగళ్ళో నీకురింగు తీసా షాపులోపలే మర్చిపోయా
[ఆమె]అవునులే ప్రేమిదే ప్రేమిదే ప్రేమిదే || అమ్మో అమ్మమ్మ||

చరణం 2

[అతడు]జీపు బండిలో నీవే రాణివంట ముద్దాబంతోలే నిన్ను చూసుకుంట
[ఆమె]ఇంటలోన నీవు రాజువంట కంటిలోన నిన్ను దాచుకుంట
[అతడు]అవునులే ప్రేమిదే ప్రేమిదే ప్రేమిదే
[ఆమె]జాతకాన్ని నేను నమ్ముతాను నీవే జోడువంటు చెప్పినాడు
[అతడు]పిల్లో బ్రాహ్మణ్ణి నేను కలిసినాను నువ్వే నాదానివని చెప్పినాడు
[ఆమె]మాలలే వేసుకో ఆలినే చేసుకో ||అమ్మో అమ్మమ్మ||