కనులు మూసే మౌనమా

పల్లవి

[అతడు]కనులు మూసే మౌనమా అంతులేని శాంతమా బ్రతుకుచేరే
గమ్యమా చివర మిగిలే నేస్తమా నువు ఇహపరాకలే
వంతెన రేగే అలజడులకే శాంతమా జగమంతా మాయేనంటు
తీల్చేపాటమా బందాల సంకెళ్ళని తెంచే బందమా || కనులు మూసే||

చరణం 1

[అతడు]ప్రాణం పాడే చివరి స్వరము నీవు నీలో ఇవి ఎక్కువ తక్కువ
లేవు ధనికుడైన, నిరుపేదైన ఒక్కటేలే నీముందర నీవు
వచ్చే దారేమిటో ఊహకందదు ససేమిరా ఆహ్వానం అక్కర్లేని
అతిధి దైవము ||కనులు మూసే||

చరణం 2

[ఆమె]ఎన్నో ఘనచరితలన్ని ఏవి నీలో అవి కరిగి చెరిగిపోయే
ఆయువు అన్నది కాస్తేనని క్షణము వ్యర్థం చేయొద్దని ఆశరాశులు
పోగేసిన వెంట తీసుకురాలేమని చాటించే సత్యం నువ్వే
ప్రాణరూపమా ||కనులు మూసే||