ఆంధ్రమాత పుత్రులారా

మిత్రులార ఆంధ్ర మాత పుత్రులార మంజుళ మధు పాత్రలార!
నలుబది ఆరేండ్లకు ముందర హృదయాలను కలిపేసిన
మననేకం చేసేసిన మధుర మంగళోషస్సును
మనకు జ్ఞాపకం చేసే ఈ హేమంత తమస్సులో

విభేదాల దుమ్ముదులిపి వివరాల మడతలు విపొపేసి
విషాదాల చలి తొలగించి కవిత్వాల రగ్గు కప్పి
ఉత్సవాల హుక్కుతో మత్తెక్కిన మనసుతో
కైపెక్కిన కనులతో మనసు మనం తెలుసుకునే

మాట మరచిపోరాదు భగవంతుని తలపించీ
వరమాత్తమమైన మతం యమునింటికి పంపించీ
అతి హీన మతమైంది ప్రజాక్షేమమును నోరే

రాజకీయ రాజీవం ప్రజాక్షామ కారకమై
నేశైనది నిర్జీనం గుండెను రెండుగ చీల్చే
మొండితనం పనికిరాదు మనసులనేకం చేసే
మంచితనం కావాలి అభాగ్యుల్ని కాము మనం

భాగ్యనగరి మనది అపజయం లేదు మనకు
విజయవాడ మనది హిమశైలం మనది
హిందూ మహాసముద్ర జలం మనది
హరశూలం మనది హరిచక్రం మనది

హరి హరులను మించినట్టి నర హృదయం ఈనాడు
వానర హృదయ మయింది మన్ ఏక్ మందిర్ నహీ
మన్ ఏక్ బందర్ హై నరుడు అలనాడు వానరుడు
ఈనాడు నిశాచరుడు ప్రశాంత మానవ జగతిని
అశాంతి రేకెత్తించే నిశాచరుడు మనకు వద్దు
నరుడు కావాలి నిండైన నిశాకరుడు

గుండెలలో అనురాగపు పండు వెన్నెలలు
పండించే నిండైన నిశాచరుడు నేక్కడో
దూర దూరాల వున్నాను కాని మీ హృదయాల
తీరతీరాల వున్నాను మీ గుండెల పూడండల
దార దారాన వున్నాను రవీంద్ర భారతిలో
కవీంద్రుల కవిత్వపు హారతిలో వున్నాను

తెగిన గాలిపటం కాదు తెలంగాణ
తెలంగాణ తేనెసోన తెలంగాణ దివ్యవీణ
తెలంగాణ మహారాణా తెలంగాణ నవకవితల నజరానా
తెలుగు జాతి ఒక్కటి భరత జాతి ఒక్కటి
ప్రపంచమే ఒక్కటి శశి బింబం ఒక్కటి
రవి బింబం ఒక్కటి రేపు నవంబరు ఒక్కటి
యెప్పుడూ మనమంతా ఒక్కటి