అందరమూ మానవులం
నారాయన నారాయణ అల్లా అల్లా
మా పాలిటి తండ్రీ నీ పిల్లల మేమెల్ల
||నారా||
మతమన్నది నాకంటికి మసకైతే
మతమన్నది నా మనసుకు మబ్బయితే
మతం వద్దు గీతం అద్దు
మాయా మర్మం వద్దు
||నారా||
ద్వేషాలూ రోషాలు తెచ్చేదే మతమైతే
కలహాలు కక్షలు కలిగించేదే గతమైతే
మతం వద్దు గతం వద్దు
మారణహొమం వద్దు
||నారా||
మతమన్నది గాంధీజీ హితమైతే
మతమన్నది లోకానికి హితమైతే
హిందువులం ముస్లిములం
అందరమూ మానవులం
అందరమూ