ఆంధ్ర సముద్ర మీయమ్మ పాదాలపై

కానిపింపదే నేడు కాకతీయ ప్రాజ్య
సామ్రాజ్య జాతీయ జయపతక:
వినిపింపరే నేడు విద్యానగర రాజ
సభలోని విజయ దుందుభుక మ్రోత:
వెలగదే నేడు బొబ్బిలి కోట బురుజుపై
తాండ్ర పాపయ తళత్తళల బాకు;

నిప్పచ్చరంబయ్యెనే నేడు వీర ప
ల్నాటి యోధుల సింహనాధలక్ష్మీ;
చెక్కు చెదరని, యేనాడు మొక్కవోని
అంధ్ర పౌరుషమిప్పు డద్వాన్నమయె;
మరలనొక మాటు వెనుకకు మరలి చూచి

దిద్దుకోవమ్మ బిడ్డల తెలుగు తల్లి!
కవులకు బంగారు క్డియాలు తొడిగిన
రాయల గన్న వరాల కడుపు
సీసాలతో కవితాసార మిచ్చు శ్రీ
నాధుని గన్న రత్నాల కడుపు
భద్రాద్రిలో రామభద్రు స్థాపించు గో

పన్నకు గన్న పుర్వాంపు కడుపు
జగమగంటిమి నల్డెసల్ వెలార్చిన పాప
రాయని గన్న వజ్రాల కడుపు
పిసినిగొట్టు రాజులకును పిలక జుట్టు
కుకవులకు పిచ్చి పిచ్చి భక్తులకు పిరికి
వందలకు తావు గాకుండ ముందు ముందు
దిద్దుకోవమ్మ బిడ్డల తెలుగుతల్లి!

అభ్రంకషంబ్ హిమాలయం బే తల్లి
మౌళి జుట్టిన మల్లెపూల చెండు
గోదావరి కృష్ణ లేవేవి కటిసీమ
వ్రేలాడు ఆణిముత్యాల నదులు
ఆంధ్ర సముద్రమీ యమ్మ పాదాలపై
జీరాడు పట్టుకుంచ్చెల చెరంగు
ఎనుబది కోట్లు దాటిన భారతీయు లే

కళ్యాణి చల్లని కడుపు పంట
ఆమె బ్రహ్మర్షి జాతి కళ్యాణ గీతి
ధర్మాసముసేత వీరమాత ప్రవూతి
విశ్వవిఖ్యాత సిశ్రీల వెలముగాతి
పరమ కరుణ సమేత మా భరతమాత