పల్లవి
[అతడు] చెప్పనా ఒక చిన్నమాట
చెవిలో చెప్పనా ఒక మంచిమాట
చరణం 1
అనగనగా ఉన్నది ఒక పల్లెటూరు
ఆ వూళ్ళో వున్నది ఒక అమ్మాయిగారు
ఒక అబ్బాయంటె ఆమెకు ఎంతో జాలి
ఎందుకో యేమో నువ్వే చెప్పాలి
||చె||
చరణం 2
అడవిని ఉసిరికచెట్టు కాయకాసింది
సముద్రమ్మ ఉప్పుతోటి జత కుదిరింది
కమ్మకమ్మగా రుచి కలగకుంటుందా ||2||
ఎదురుగా చూస్తుంటే నోరూరుకుంటుందా చెప్పనా
[ఆమె] చెప్పు వింటా
||చె||
చరణం 3
అప్పుడప్పుడు ఆ ఇద్దరు కలుసుకున్నారు
మబ్బుపట్టినపుడు వాన కురవకుంటుందా
మమతెరిగినపుడు అది వూరుకుంటుందా
[ఆమె] ఆహ అదా సరే
[అతడు] ఇలా వుండగా
[ఆమె] ఉండగా
[అతడు] ఒకనాడు ఆ అమ్మాయి చల్లాగా
ఆ అబ్బాయి దగ్గరకు వచ్చింది వచ్చి
[ఆమె] గుండెవిప్పి ప్రేమంతా కుమ్మరించింది
స్వచ్చమైనదో కాదో చూడమన్నది
[అతడు] ఓహొ ఆ తర్వాత
[ఆమె] చేయి చేయి కలిపింది చెంతకు చేరింది
పందిట్లో పెళ్లెపుడని ప్రశ్న వేసింది
||చె||