ఆడపిల్ల మగవాడూ కలసినపుడు

పల్లవి

[ఆమె] ఆడపిల్ల మగవాడూ కలసినపుడు అనుకొనే మాటలు రెండే రెండూ ||2||
[అతడు] లేడికనులు లేతమనసు కలిసినప్పుడు పాదుకునే పాట ఒకటే ఒకటి ||ఆడ||

చరణం 1

[ఆమె] చందమామా చల్లగాలీ ||2||
వంగినప్పుడు అంగలించే హృదయాలు రెండూ ఒకటి
[అతడు] ఎర్రపెదవి శోభచెక్కిలి చేరినపుడా
యదలోపలి ఆనందం ఒకటే ఒకటే ||ఆడ||

చరణం 2

[అతడు] కోరవయసు ఓరచూపు కులికినపుడు ||2||
కోరదగిన అనుభవము ఒకటె ఒకటే
[ఆమె] పులకరించే ప్రేమ విసిరి పూచినపుడు
గిలిగింత లెక్కిస్తే అవియే కోటి ||ఆడ ||