పల్లవి
[అతడు] డబ్బుకు లోకం దాసోహం
[అతడు] నువ్వు నేను నడచేది ఒకేబాట ఒకేబాట ||2||
[ఆమె] నువ్వు నేను కలిపేది ఒకేమాట ఒకేమాట ||2||
[అతడు] ఆ బాట ఏనాడు తిరుగులేనిది
[ఆమె] ఆ మాట ఏనాడు తీరిపోనిది
||నువ్వు||
చరణం 1
[అతడు] దూరాన శిఖరాలు ఉన్నాయి
వాటిని చేరుకునే పాదాలను రమ్మన్నాయి ||2||
[ఆమె] తూర్పున కిరణాలు ఉదయించాలి ||2||
గగన తీరాలను అందుకొను పయనించాలి
[అతడు] మరి మన పయనం ఎందాక ఎందాక
[ఆమె] ఆ శిఖరాలు తీరాలు అందేదాక అందేదాక
||నువ్వు||
చరణం 2
[అతడు] చిరుగాలిలో యేదో నాదాలు ఉన్నాయి
[ఆమె] అది మురళి తెలి తెలి రాగాలు అవుతాయి
[అతడు] వాన చినుకుల్లొ కనరాని తళుకులు వున్నాయి
[ఆమె] అవి ముత్యపు చిప్పల్లో పడితేనే ముత్యాలు అవుతాయి
[అతడు] మంచి ఆశయాలు వుంటె మానవులు అందరూ
మచ్చలేని వెలుగునే చేరుకుందురు
||నువ్వు||