పల్లవి
[అతడు] చిన్నా పెద్దా అంతా పండుగ చెయ్యాలంటా
తీపి చేదు అంతా పంచిపెట్టాలంటా
రంగేళి హొలి రంగామాకేళి ఎక్కడ నువ్వుంటే అక్కడ జరగాలి
రవ్వల రించోలి సిరిదివ్వెల దివాళి ఎప్పుడురమ్మంటే అప్పుడు రావాలి
పంచాంగం చెబితే గాని పండుగా రానందా
సంతోషంగా గడపడానికో సుముహూర్తం ఉంటుందా ||రంగేళి||
చరణం 1
[అతడు] తినేది చేదని తెలిసి అది ఉగాది విందని తలచి
ఇష్టపడే ఆ పూటే అలవాటైతే ప్రతిరోజు వసంత మవుతుంది
గడపలో అన్నీ జరిపి ఆ గణపతి పండుగ జరిపి నిమజ్జనం కాని జనం
జరిపే పయనం నిత్యం భద్రపదమవుతుంది
లోకుల చీకటి తొలగించే శుభ సమయం కోసవెతికే
చూపులు దీపాలుగ చేసే జాగరనే శివరాత్రి
ప్రత్యేకంగా బందువులొచ్చే రోజొకటుండాలా చుట్టూ ఇందరు
చుట్టాలుంటే సందడిగా లేదా ||రంగేళి||
చరణం 2
[అతడు] కన్నుల జోల పదాలై గొల్లల జాన పదులై నరుడికి గీతాపదమై
నడవడమంటే అర్థం కృష్ణ జయంతి
అందరి ఎండకి మనమే పందరిగేలక్షణమే మనిషి గనం మంటారని గుర్తించడమే
మనిషిని తలపించి విజయం సాధించే క్షణమే దసరా దశమి అవుతుంది
పదుగురు పంచిన వెచ్చని ఊపిరి భోగిమంటయ్యింది
మద్ ముంగిలలో ముగ్గులు వేసే సాంతేశం క్రాంతి
చరణం 3
[అతడు] ఒకటి రెండంటు విడిగా లెక్కెడితే తొమ్మిది గుమందాటవు
ఎప్పుడు అంకెలు ఎన్నంటే పక్కన నిలబెడుతూ కలుపుతూ పోతుంటే
లెక్కకైనా లెక్కల కందవు సంఖ్యలు ఎన్నంటే
నువ్వు నువ్వుగా నేను నేనుగా ఉన్నామనుకుంటే
కోట్ల ఒకటే ఎవరి ముసుగులో వాళ్ళుంటామంటే
నిన్ను నన్ను కలిపి మనమని అనుకున్నామంటే
ప్రపంచ జనాభా మొత్తం కలిపితే మనిషితనం ఒక్కటే
మనిషితనం ఒక్కటే