కొంచెం కారంగా కొంచెం గారంగా కొంచెం

పల్లవి

[ఆమె] కొంచెం కారంగా కొంచెం గారంగా కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా
అందించని అదిరే అదరాంజలి పండించని కల నీ కౌగిలి
సుడిగాలిగా మారి చుట్టేసుకోవాలి
మంచల్లే నిమిరి నీ జాలి మంటల్లే నన్ను మరిగించాలి
||కొంచెం||

చరణం 1

[ఆమె] తలుపేసుకుంటే నీ తలుపాగుతుందా మదిలో నువ్వుంటే స్నానం సాగుతుందా
నీ విషయమే పాకింది నరనరమున ఇక నావశము కాకుంది మాయ యాతనా
లేని పోని నిందలు గాని హాయిగానే ఉందేగాని ఉన్న మాట నీతో చెప్పని
||కొంచెం||

చరణం 2

[ఆమె] అమ్మాయినంటూ నాకే గుర్తు చేస్తూ లాగావు బొట్లు గుండెల్లోకి
చూస్తు నీ గాలి కబురొచ్చి నులివెచ్చగా నువ్వేమేమి చేస్తావు చెబుతుండగా
మనస్సు గుండె మన్మధ లేఖ కెవ్వుమంది కమ్మని కేక వయస్సు పొంగిపోయే వేడిగా
||కొంచెం||