ఒకే ఒక మాట మదిలోన దాగుంది

పల్లవి

[అతడు] ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాట పెదవోపలేనంత తియ్యంగా
నా పేరు నీ ప్రేమని నా దారి నీ వలపని నా చూపు నీ నవ్వని
నా ఊపిరి నువ్వని నీకు చెప్పాలని

చరణం 1

[అతడు] నేను అని లేను అని చెబితే ఏం చేస్తావు
నమ్మనని నువ్వనుకొని చాల్లే పొమ్మంటావు
నీ మనస్సులోని ఆశల నిలిచేది నేనని
నీ తనువులోని స్పర్శగా తగిలేది నేనని
నీ కంతి మైమరుపులో నన్ను పోల్చుకుంటానని
తల ఆంచినీ గుండెపై నా పేరు వింటానని నీకు చెప్పాలని
||ఒకే ఒక||

చరణం 2

[అతడు] నీ అడుగై నడవడమే పయనమన్నది పాదం
నిను విడిచి బతకడమే మరణమన్నది ప్రాణం
నువ్వురాక ముందు జీవితం గురుతైన లేదని
నిను కలుసుకున్న ఆ క్షణం నను వదిలిపోదని
ప్రతి గడియ ఓ జన్మగానే గడుపుకున్నానని
ఈ మహిమ నీదేనని నీకైనా తెలుసా అని నీకు చెప్పాలని
||ఒకే ఒక||