ముద్దబంతి పూలు బెట్టి మొగలిరేకులు

[అతడు] ముద్దబంతి పూలు బెట్టి మొగలిరేకులు జడను చుట్టి
[ఆమె] జడను చుట్టి
[అతడు] హంసలా నడచివచ్చే చిట్టెమ్మా
[ఆమె] చిట్టెమ్మా
[అతడు] మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా
[ఆమె] చెప్పమ్మా ||ముద్ద||
[ఆమె] అద్దమంటి మనసువుంది అందమైన వయసువుంది
[అతడు] వయసువుంది
[ఆమె] ఇంతకన్న వుండేదేంది కిట్టయ్యా
[అతడు] కిట్టయ్యా
[ఆమె] ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా
[అతడు] చెప్పయ్యా ||ముద్ద||
తందాన తానని తందాన తానని తనీ తాననేనా తానేనా

చరణం 1

పుట్టింటి ఆరణాలు ఘనమైన కట్నాలు||2||
అత్తవారింటి నిండా వేసినా అవి అభిమానమంత విలువజేసునా||ముద్ద||


[అతడు] తందానని తాననిన హొ తనాన తినని నాతారారో
[ఆమె] అభిమాన మాభరణం మర్యాదే భూషణం
గుణము మంచిదైతే చాలయా
తన గొప్పతనము చెప్పుకోను వీలయా ||అద్ద||

చరణం 2

[అతడు] కాలు చేయి లోపమని కొక్కిరాయి రూపమని
వదినలు నన్ను గేలిజేతురా
పిల్లను దెచ్చి పెళ్ళి జేతురా
[ఆమె] ఎవరేమి అన్ననేమి ఎగతాళి చేయనేమి
నవ్విన నాపచేనే పండదా నలుగురు మెచ్చురోజు వుండదా ||అద్ద||