శ్రీరామచంద్రా నారాయణ ఎన్ని కష్టాలు

పల్లవి

[ఆమె] శ్రీరామచంద్రా నారాయణ ఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయనా ||2||
[అతడు] శ్రీ రామ

చరణం 1

[అతడు] పగలంత ఇద్దరము ఆలుమగలము
పడుకునే వేళకు పక్కలే దూరము
[ఆమె] ఊరివారి కందము ఉత్తుత్తి కాపురము
నోరూరుతున్న మనకేమో ఓపలేని తాపము||శ్రీరామ||

చరణం 2

[అతడు] అన్ని వున్న అందగత్తె అందుబాటులో ఉన్నా
అన్నమాట కోసమే ఆశలన్ని అణచుకున్నా
[ఆమె] ఉన్నవన్ని ఉన్నట్టె వూడ్చి ఇవ్వాలనుకున్నా
కన్నెకున్న హద్దులకు కట్టుబడి వూరుకున్నా||శ్రీరామ||

చరణం 3

[ఆమె] కళ్లలోకి చూడకు కాళ్ళు కలిపి నడవకు
మూడుముళ్ళు పదేవరకు మోమాట పెట్టకు||కళ్ళలో||
[అతడు] ఆ మంచిరోజు వచ్చును హద్దు లెగిరిపోవును||2||
[ఆమె] కాచుకున్న వయసు కచ్చి అప్పుడే తీరును||శ్రీరామ||