పల్లవి
[ఆమె] ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు దేశదేశాలన్ని తిరిగిచూసేవు
ఏడతానున్నాడో బావం జాడ తెలిసినపోయిరావా
ఆ... అందాల ఓ మేఘమాల
ఆ... చందాల ఓ మేఘమాల
[అతడు] గగనసీమల తేలు ఓ మేఘమాలా...
మా ఊరిగుడిపైన మరలి వస్తున్నావా మల్లి మాటేదైన నాతో
మనసు చల్లగ చెప్పిపోవా నీలాల ఓ మేఘమాల
[ఆమె] మమతలెరిగిన మేఘమాలా నా మనసు బావకు చెప్పిరావా
ఇన్నాళ్ళు నా కళ్ళు దిగులుతో రేపగలు ఎదురు తెన్నులు చూచెనే
బావకై కనులు కాయలు కాచెనే ||అందాల||
[అతడు] మనసు తెలిసిన మేఘమాలా మరువలేనని చెప్పలేవా
మల్లితో మరువలేనని చెప్పలేవా కళ్ళు తెరచినగాని
కళ్ళు మూసినగాని మల్లిరూపే నిలచెనే నా చెంత మల్లిమాటే పలికెనే
జాలిగుండెల మేఘమాల నా బావలేనిదే బ్రతకజాలా
కురియు నా కన్నీరు గుండెలో దాచుకొని
వానజల్లుగ కురిసిపోవా కన్నీరు ఆనవాలుగ బావమొరల ||అందాల||