సరిగంచు చీరకట్టి బొమ్మంచు రైక తొడికి

[అతడు] సరిగంచు చీరకట్టి బొమ్మంచు రైక తొడిగి
జలసాగ నాతో రావే ఒయ్యారి ముద్దులగుమ్మా
సినిమాకి పోదాంలేవే కయ్యాళి రంగులబొమ్మా
[ఆమె] నిలపర చిన్నోడో నీ సోకు నీ సీకు
యాడ నేర్చినావురో ఈ నాటు ఈ గోటు
తిండ మెతుకాయే మీసాలకి సెంటాయే
ఏటేటా బిడ్డాయే ఓపిక ఉడగిపోయే
ఇంట్లో ఈగలమోతా బయట పల్లకి మోతా

[అతడు] సంపాదన చేసుకొను సత్త వున్నది
చక్కనైన చుక్క పక్కనున్నది
తావి చల్లగ చూసి సంతు వున్నది
ఇంతకన్నా స్వర్గమంటె ఎక్కడున్నది
నిలపవే నా రాణి నీకేల భయమింక
ఆపవే బఠాణి అల్లి బిల్లి కూతలింక
[ఆమె] కలం గలి ఏమాయే గాలికి వదిలావాయే
బిడ్డలంటే పట్టదాయే చదువు గొడవ ఎత్తవాయే
బండచాకిరిల్లా అల బ్రతుకే తెల్లారిపోయే

[అతడు] సంతానం పెరగకుండా చూసుకుందామే
సంసారం చాటుమాటు చేసుకుందామే
చిల్లరంతా కూడబెట్టి దాచుకుందామే
పిల్లగాళ్ళ చదువులకి వాడుకుందామే
నిజమే నా రాణి నువు చూపిన చినబట
వింటానులే ఇక మీదట నీమాట
[ఇద్దరు] సంతోషమే సంతోషమే చింతలేని కాపురము శ్రీరంగమే
ఆలుమగలు ఒక్కటైతే ఆనందమే
||సంతో||