గో గో అదిగో అదిగో లోకం

పల్లవి

[ఆమె] సైనికుడు సైనికుడు
గో గో గో గో గో గో...
గో గో అదిగో అదిగో లోకం అదిగో ||2||
గో గో ఇదిగో ఇదిగో కాలం ఇదిగో ||2||
కాలమనే నదిలో కదిలే అలలనే కొట్టి
లోకమనే నదిలో ఒదిగే నిదురను కట్టి
శ్రామికుడు నువ్వయి ప్రేమికుడు నువ్వయి సాగిపోనేడే
సైనుకుడు నువ్వే ||గో గో అదిగో||


చరణం 1


[ఆమె] ఎం.బి.ఎ., చదివినా ఎం.సి.ఎ., చదివినా ఈ జగతిని సైతం చదవరా
వేదాలే చదివినా వేమన నీతులు చదివినా అవి నీతుల లోతులు చదువరా
వికార్షం మాటున విషాదం ఉందిరా విరామం వద్దురా విధానం మర్చరా
ఒంటి సైనికుడల్లే కవాతులై చెయ్యరా
కోటి సూర్యుల మల్లే ప్రకాశమే పంచరా ||గో గో అదిగో||


చరణం 2


[ఆమె] ఓమైలవ్ మాటకో అమ్మాయి మనస్సే గెలిచినా ఆ గెలుపే ఇద్దరి మధ్యన
ఓమై ఫ్రెండ్ మాటతో అందరి మనస్సులు గెలవరా
ఆ గెలుపొక మలుపును చూపురా
ప్రయత్నం నీదిరా ప్రభుత్వం నువ్వురా ప్రభావం నీదిరా
ప్రభంజనం నవ్వరా
సాటి స్నేహితుడల్లే జనాలతో నడవరా
నేటి నాయకుడల్లే జగాలనే నడపరా ||గో గో అదిగో||