అవ్యాయి తువ్వాయి అల్లాడె అమ్మాయి

పల్లవి

[అతడు] అవ్యాయి తువ్వాయి అల్లాడె అమ్మాయి
[ఆమె] అవ్వాయి తువ్వాయి కిల్లాడి అబ్బాయి
[అతడు] దాగీ దాగని సోకే బరువయి ఆగీ ఆగని ఈడే ఇరుకయి
[ఆమె] తాకీతాకని చూపే చినుకయి దూకీదూకనీ ఊపే వరదయి
[అతడు] ఏం చేస్తుందో ఎలా ముంచేస్తుందో అయ్యోరామ అసలిదేంలడాయి ||అవ్వాయి||

చరణం 1

[ఆమె] పాలోసి పెంచా ప్రతి భంగిమ పోగేసి ఉంచా పురుషోత్తమా
కమాండం తెగిస్తే సమస్తం తమర్ధేగా
[అతడు] కంగారు పెట్టే సింగారమా బంగారం అంతా భద్రం సుమా
ప్రమాదం తెలిస్తే సరదా పడతావా
[ఆమె] ఎన్నాళ్ళీ గాలిలో తిరుగుడు ఇలా నా ఇళ్ళో స్థిరపడే దారిచూడు
[అతడు] బాలామణి సరే కానీ మరి పద చెల్లిస్తా ప్రతీ బకాయి ||అవ్వాయి||

చరణం 2

[అతడు] తెగరెచ్చి పోకే పసి పిచ్చుక నన్నపలేదే నీ ఓపిక పిడుగై పడనా వ్రతమే చెడినాక
[ఆమె] చిర్రెత్తి వస్తే మగపుట్టుక సుఖమార మిస్తా సుఖపెట్టగా ఒడిలో పడనా వరమే అడిగాక
[అతడు] కవ్వింత లెందుకే బాలిక మరి పువ్వంటి సున్నితం కందిపోగా
[ఆమె] చిచ్చవుతాను నువ్వే గిత్తవుతావు ఎటోతేలందే ఇదేంబడాయి ||అవ్వాయి||