రామరామ రఘురామ అని పాడుతున్న

పల్లవి

రామరామ రఘురామ అని పాడుతున్న హనుమా
అంత భక్తి పరవశమా ఓ కంట మమ్ముగనుమా
సరదాగా.. నా గాలి పాట వినుమా
విన్నాకా.. బదులిచ్చి ఆదుకొనుమా
గాలికి పుట్టా గాలికి పెరిగా అచ్చంనీలాగా..
నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణమొకటేగా.. ఆ... ||రామరామ||

చరణం 1

అమ్మల్లె నను పెంచింది ఈ పల్లెసీమ
నాన్నల్లె నడిపించింది ఊరంత ప్రేమ ||అమ్మల్లె||
ఎలా పెంచుకున్నా.. ఎలా పిలుచుకున్నా..
ఈ మట్టి సొంతం నా చిట్టిజన్మం
అన్నీ సొంత ఇళ్ళే.. అంతా అయిన వాళ్ళే..
ఈ స్నేహ బంధం నా పూర్వ పుణ్యం
బ్రతుకంతా.. ఇది తీరే.. రుణమా.. ఆ... ||రామరామ||

చరణం 2

ఏ ఆటలాడిస్తావో ఓ కోతి బొమ్మా
ఏ బాట చూపిస్తావో కానున్న బ్రహ్మ
ప్రసన్నాంజనేయం అదే నామధేయం
ప్రతి మంచి కార్యం జరిపించు దైవం
ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం
నాలోని ధైర్యం శ్రీ ఆంజనేయం
నా వెంటే.. నువ్వుంటే.. భయమా... ||రామరామ ||