పల్లవి
[ఆమె] పూలఘుమఘుమ చేరని ఓ మూల ఉంటే ఎలా
తేనె మదురిమ చేదని ఆ మూతి ముడిపేంటలా
ప్రేమంటె పామని బెదరాల దీమాగా తిరగర మగరాయడ
బామంటె చూడని వ్రతమేలా పంతాలె చాలురా ప్రవరాక్షుడా
మారనే మారవా మారనీ మానవా మౌనివా
మానవా తెరుచుకో మానవా
||పూలగుమగుమ||
చరణం 1
[ఆమె] చేరితే గతి ఆధారమై బంధమై అళ్ళుకో
దరికొచ్చి అరవిచ్చి అరవిందమై అందమే అందుకో
మునిపంటితో నాపెదవిపై మల్లెలే తుంచుకో
నావాలు జడ చుట్టుకొని మొగలి రేఖా నడుము నడిపించుకో
వయసులో పరవసం చూపుగా చేసుకో
సొగసులో పరిమళం శ్వాసగా తీసుకో ||పూలగుమగుమ||
చరణం 2
[ఆమె] ప్రతి ముద్దుతో ఉదయించనీ కొత్త పున్నాంగనై
జతలీలలో అలసి మంటెక్కిపోనీ నిద్రగన్నేరునై
నీ గుండెపై ఒదిగుండనీ పొగడ పూదండనై
నీ కంటి కోనేట కొలివుండిపోనీ చెలిమి చెంగల్వనై
మోజులే జాజులై పూయనీ హాయినీ
తాపమే తుమ్మెదై తీయనీ తేనని
||పూలగుమగుమ||