[అతడు] పద పదవే వయ్యారి గాలిపటమా||2||
పైన పక్షిలాగ ఎగిరిపోయే పక్కచూపు
చూసుకుంటూ తిరిగెదవే గాలిపటమా||పద||
చరణం 1
[అతడు] ప్రేమ గోలలోన చిక్కిపోయినావ
నీ ప్రియుడున్న చోటుకే పోదువా||ప్రేమ||
[ఆమె] నీ పలుకంతా నీ కులుకంతా
అది ఎందుకో తెలుసును అంతా||పద||
చరణం 2
[అతడు] నీకు ఎవరిచ్చారే బిరుదు తోక
కొని తెచ్చావేమో అంతేగాక||నీకు||
రాజు లెందరూడినా మోజులెంత మారినా
తెగిపోక నిలిచే నీతోక
చరణం 3
[ఆమె] నీలిమబ్బుల్లో ఆడుకుందువేమో
వింత చుక్కల్తో నవ్వుకుందువేమో||నీలి||
[అతడు] వగలాడి జగజంతివిలే
దిగి రాకుండా ఎటులుందువులే||పద||