సలాం లేకుం సాహేబుగారు బలేషోకుగా వచ్చేరా

పల్లవి

[ఆమె] సలాం లేకుం సాహేబుగారు బలేషోకుగా వచ్చేరా
సలాం లేకుం పసందుచూసి
నిషాచేసి దిల్ ఖుషీ చేయగా వచ్చానే||2||

చరణం 1

[ఆమె] నడుము ఒంగి గడ్డము మెరిసిన
పడతి మోజు పోలేదా వలపు తగ్గిపోలేదా
[అతడు] వయసుతోటి పనియేముందే నా మనసు చూడవే
బుల్ బుల్ నా హొయలు చూడవే జిల్ జిల్ ||సలామ||

చరణం 2

[ఆమె] అత్తరు మోమున గొట్టెనేమి
అతను గెల్చుకో లైలా పోటిలో నువ్వు డిల్లా
[అతడు] అత్తరుకంటె మత్తును చూపే సత్తువ ఉందే
పిల్ల నా చలాకీ చమ్కిపిల్ల

చరణం 3

[ఆమె] కన్నెలందరు కాలుదువ్వితే దిమ్మతిరిగి
పోతుందోయ్ నీ గుండె పీచుమంటుందోయ్
[అతడు] జబ్బ చరిచి దూకేనంటే దెబ్బకు మీరు పరారు
మీ దెయ్యం దిగుట ఖరారు || సలామ ||