పల్లవి
[అతడు] ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపూ సొలుపేమున్నది
ఇద్దరమొకటై చేయి కలిపితే
ఎదురేమున్నది మనకు కొదవేమున్నది
[ఆమె] ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపూ సొలుపేమున్నది
ఇద్దరమొకటై చేయి కలిపితే
ఎదురేమున్నది మనకు కొదవేమున్నది
చరణం 1
[అతడు] ఒంపులుతిరిగి వయ్యారంగా వూపుతూ విసురుతూ
తోడేస్తుంటే ||2||
నీ గాజులు ఘల్లని మోగుతుంటే
నా మనసు ఝల్లుమంటున్నది ||2|| ||ఆడుతు||
చరణం 2
[అతడు] తీరని కోరిక లూరింపంగా ఓరకంట నను చూస్తూవుంటే
చిలిపినవ్వులు చిందుతొక్కి ||2||
సిగ్గు ముంచుకొస్తున్నది
నును సిగ్గు ముంచుకొస్తున్నది ||ఆడుతు||
చరణం 3
[అతడు] చెదరి జారిన కుంకుమరేఖలు పెదవులపైన మెరుస్తుంటే
తియ్యని తలపులు నాలో ఏవో తికమక చేస్తూ ఉన్నవి అహ ||ఆడుతు||
చరణం 4
[అతడు] మాటల్లో మోమాటం నిలిపి రాగంలో అనురాగం కలిసి
పాట పాడుతుంటే నా మది పరవశమైపోతున్నది
పరవశమైపోతూ వున్నది ఆ ఆ ఆ ఆ ...||ఆతడు||