చిన్నారి బుల్లెమ్మ సిగ్గెందుకు లేవమ్మా

పల్లవి

[అతడు] చిన్నారి బుల్లెమ్మ సిగ్గెందుకు లేవమ్మా
చన్నీటి స్నానాలు చాలమ్మ అమ్మా నీ చక్కిలిగింతలు
నాకందించగ రావమ్మ||చిన్నారి||

చరణం 1

[అతడు] మెరిసిన నీ కళ్ళాలో ఆ రంగులు చూసి
తడిసిన నీ మేనిలో ఆ పొంగులు చూసి
[ఆమె] ఏం చూసి?
[అతడు] రంగులు చూసి పొంగులు చూసి
రంగుల కొంగుల హంగులు చూసి
మానసేమో అంటుందే మత్తెక్కి పోతుందే ||2||
ఓళ్ళంతా జిల్లంటుందే బుల్లెమ్మ ||చిన్నారి||

చరణం 2

[అతడు] చలిచలిగా ఉండేకే ఓ చక్కనిదాన
తీగలు కావాలటే ఓ చిక్కనిదాన
[ఆమె] యూ సిల్లీ
చక్కనిదాన చిక్కనిదాన చక్కని చిక్కని చెక్కిలిదాన
వెచ్చదనం నేనిస్తా ముచ్చటలే తీరుస్తా ||2||
మోజుంటే ముందుకురావే బుల్లెమ్మ బుల్లెమ్మా ||చిన్నారి||