[ఆమె] కోటలోని మొనగాడా ||2||
వేటకు వచ్చావా ||2||
జింకపిల్ల కోసమో ఇంక దేనికోసమో ||2||
చరణం 1
[ఆమె] ఎలాటి పిల్ల అది ఏపాటి అందమది||2||
ఏ వూరు చిన్నది ఏ కోన వున్నది ||2||
[అతడు] చారడు కన్నులది చామంతి వన్నెలది ||2||
ఏ వూరు ఏమో నా ఎదురుగనే ఉన్నది
||కోటలోని||
చరణం 2
[ఆమె] కత్తుల వీరునికి కన్నె వలపెందుకో
జిత్తుల సిపాయికి చెలి వలపెందుకో
కత్తులు ఒకచేత గుత్తులు ఒకచేత ||2||
నిలిచే బంటునే నీకు తగిన జంటనే ||2||
కోటలోని చినదాన వేటకు వచ్చానే
జింకపిల్ల కన్నులున్న చిన్నదాని కోసమే