పల్లవి
[అతడు] నువ్వంటే నాకెందుకో ఇంత ఇది||2||ఇంత ఇది||3||
[ఆమె] నువ్వన్నా నాకెందుకో అదే ఇది||2||అదే ఇది||3||
చరణం 1
[ఆమె] తొలినాడు ఏదోల మొదలైనది ఆ రేయి నిదురంతా కలలయినది||2||
[అతడు] మరునాడు మనసంత తానయినది ఆ ఇది ఏదో ఇద్దరికి తెలియకున్నది
||నువ్వంటే||
చరణం 2
[అతడు] వయసులో పాకానికి వచ్చినది తనువులో అణూణువున పొంగినది ||2||
నీకిచ్చేవరకు నిలువలేనన్నది ఉరికిఉరికి నీ ఒడిలో ఒదిగినది ||2|| || నువ్వంటే ||