కళ్ళల్లో కళ్ళు పెట్టిచూడు

పల్లవి

[అతడు] కళ్ళల్లో కళ్ళు పెట్టిచూడు
గుండెల్లో గుండెకలిపి చూడు
సందిట్లో బందివై చూడు ||2||
సయ్యాటలాడి చూడు
[ఆమె] కళ్ళల్లో కళ్ళుపెట్టి చూసా
గుండెల్లో గుండెకలిపి చూసా
పందిట్లో బంధినై పోతా ||2||
సయ్యాట వేలగాదు

చరణం 1

[అతడు] కానుక ఇవ్వనా
[ఆమె] వద్దులే దాచుకో
[అతడు] కోర్కె చెప్పనా
[ఆమె] తెలుసులే చెప్పకు
[అతడు] ఎందుకో సిగ్గులు
[ఆమె] ఉండవా హద్దులో
[అతడు] కాదులే కలసిపో
[ఆమె] నవ్వరా నలుగురు
కావాలి కొంతచాటు
||కళ్ళల్లో||

చరణం 2

[ఆమె] నువ్వు నా జీవితం నువ్వు నా ఊపిరి
[అతడు] నువ్విలా లేనిచో ఎండలో చీకటి
[ఆమె] పాలలో తేనెలా! ఇద్దరం ఒక్కటై
[అతడు] లోకమే మరచిపో ఏకమై కరిగిపో
యడబాటు మనకులేదు
||కళ్ళల్లో||