పల్లవి
[అతడు] నిన్న మొన్న రేకు విప్పిన లేతమొగ్గ
నీకు ఇంతలోనే నన్ను చూస్తే అంతసిగ్గా
[ఆమె] నిన్న మొన్న రెక్కలొచ్చిన గండుతుమ్మెద
నీకు అంతలోనే నన్ను చూస్తే అంత తొందర
చరణం 1
[అతడు] పరికిణీలు కట్టినపుడు లేని సొగసులు
నీ పైటకొంగుచాటున దోబూచులాడెను
[ఆమె] పసితనాన ఆడుకున్న తొక్కుడు బిళ్ళకు
నీ పరువానికి నేర్పినవి దుడుకుకోర్కెలు
||నిన్న||
చరణం 2
[అతడు] పాలబుగ్గ పూచే లేత కెంపులు
వాలుచూపు లంతుతోచె వయసు జోరులు
[ఆమె] చిరునవ్వులు వొలికే చిలిపితనాలు
చిన్ననాటి చెలిమితీసే వలపుదారులు
||నిన్న||
చరణం 3
[అతడు] ఇన్నాళ్ళు కళ్ళు కళ్ళు కలిపిచూస్తివి
ఇప్పుడే రెప్పలు రెప రెప అన్నవి
[ఆమె] ఇన్నాళ్ళు నీ కళ్ళు వూరుకొన్నవి
ఇపుడేవేవో ||2|| మూగబాసలాడుచున్నవి
||ఇన్నా||