అందమైన తీగకు పందిరుంటే చాలును

పల్లవి

[అతడు] అందమైన తీగకు పందిరుంటే చాలును
పైకి పైకి పాకుతుంది చినదానా
పరవశించి పాడుతుంది చినదానా

చరణం 1

పాదులోనే తీగవంటిది పడుచుచిన్నది
పరువమొస్తే చిగురువేసి వగలు బోతుంది
మొగ్గతొడిగి మురిసిపోతూ సిగ్గుపడుతుంది
తగ్గ జతకై కళ్ళుతోనే వెతుకుతుంటుంది
||అంద||

చరణం 2

కళ్ళు కలిపినప్పుడు కలలు వస్తాయి
కన్నెపిల్ల కలకెపుడో కాళ్ళువస్తాయి
అడుగులోన అడుగువేస్తే అందమొస్తుంది
నడవలేని నడకలే ఒక నాట్యమౌతుంది
||అంద||