కొరమీను సారా సేవల కళ్యాణం

పల్లవి

[అతడు] కొరమీను - సారా సేవల కళ్యాణం ఆ తెల్ల - రొయ్య - పీతా - బొచ్చెల ఉల్లాసం
అటుబొమ్మిడాయి మీటుతుంది సంగీతం ఇటు ఉప్పుసేప డప్పుజోరు ఉల్లాసం
కళ్యాణమే కళ్యాణం... వైభోగమే వైభోగం ||కొరమీను||

చరణం 1

[అతడు] గుండుమీను ఆడుతుంది పెళ్ళికొడుకు ఫ్రెండనీ
అరె ఆడపెళ్ళివాళ్ళు చూసి ఆట మెచ్చుకోండని ||గుండు||
పొలస చేప ఏటవాలు నడుం చూసి ఇవ్వాల ||2||
బురదమట్ట ఈల వేస్తే శెవులు అదిరిపోవాల ||కొరమీను||

చరణం 2

[అతడు] లంగ బదులు మిడ్డిలోన బంగరు తీగ పాపలు
సొంగకార్సుతున్నవయా ఇంగిలాయి సేవలు ||లంగ ||
వాలుచూపులో వాలుగ బుంగమూతి తిప్పింది ||2||
సందులోకి రమ్మని సందువ సేవ సైగ చేసింది
గుంపులోన ఎవరి గొడవ వాళ్ళది ||కొరమీను||

చరణం 3

[అతడు] యేటిగట్టు చెట్లకింద ఇద్దరికీ లవ్వింగు
కళ్ళుమండి ముళ్ళ సేవ పెట్టీందయా ఫిట్టింగు ||యేటి||
పంచాయితి పెద్దమనిషి మొయ్యసేప ఓరయా ||2||
తన తీర్పుతోనె జరుగుతున్న నిశ్చితార్ధమిదయ్యా
వెళ్ళిరండి బాబయ్యా ||కొరమీను||

చరణం 4

[అతడు] తొండ బాగ ముదిరిపోతే ఊసరెల్లి అయితదయా
రౌడీ సేప ముదిరితే రాజకీయ సేపయ్యా ||తొండ||
సిన్న సేపలను తినేది తిమింగల కదయా ||2||
ఎప్పుడైనా గద్దెమీద పెద్దరికం ఎవరిదయా
రాజకీయ తిమింగలాలదయా ||కొరమీను||