కంటిపాప కసిరించా ఏ నిజమూ

పల్లవి

[అతడు] కంటిపాప కసిరించా ఏ నిజమూ చూడనని
ఒంటిదారి మిగిలిందా నీడొకటే తోడు అని
ఓ చిరుగాలీ, నువ్వు మొగ్గనే తుంచావే
నా కథ మళ్ళీ మొట్టమొదటికి చేర్చావే
మాటలోనే ఎన్ని తూట్లు పొడిచావే
మారుతున్న జన్మ చెయ్యి విడిచావే
ఉన్న ఒక్క గుండె గుడి చేశావే
దాన్ని కాలదన్ని నువ్వు కూల్చిపోయావే ||కంటిపాప||

చరణం 1

[అతడు] సొమ్మును నమ్మినోడికి సొంతవాడు లేడురా...
ప్రేమను నమ్మినోడు అమ్ముడవడుసోదరా...
దమ్ములు ఉన్నవాడే కొమ్ము విసురుతాడురా...
నెమ్మదిగున్న పులిని తట్టి లేపమాకురా
అగ్గితోటి ఆటలేల తాట లేచిపోద మళ్ళా...||2||
[అతడు] లోతే తెలియనిదే ఏటిలోన దిగకురా
గింజలు ఎరువేస్తే పంజరాన పడకురా
కోసే కొడవలికి కొయ్యడమే తెలుసురా
వేసే అడుగు నువ్వు ఆచి తూచి వెయ్యరా
సాలె గూడు గూడు కాదు పాము పడగ నీడ కాదు ||2||