పల్లవి
[అతడు] నీ కోసం పిల్లా నీ కోసం
నా బాడిలో ప్రాణం స్టిక్ అయి ఉన్నది నీకోసం ||నీకోసం||
మనసంతా ఉందే నీకోసం నా హార్ట్ సౌల్ బుక్కైవున్నదే నీకోసం
[ఆమె] నీకోసం మావా నీకోసం
నా ఫెయిర్ అయ్ లవ్లీ మెరుపులన్నీ నీకోసం
అందమంతా ఉన్నదే నీకోసం నా ఫారిన్ ఫేంట్ పిలుపులన్నీ నీకోసం
చరణం 1
[అతడు] నిన్ను రోడ్డు మీద చూశను ఏక్‌బారు
నా మనసు మళ్ళీ చూడమంది దోబారు
నా హార్టు బీటులోన నువ్వే తీన్‌బారు
నువ్వే లేకపోతే నా లైఫే బేకారు
[ఆమె] నీ సొట్ట బుగ్గ నవ్వు షేరు తల్చారు
నీ కంటి చూపువెంటాడే సన్‌ఫ్లవరు
నీ చాతి సైజు వారేవ్వా వాల్తేరు
అది నన్నె మోసే ఏసీ స్లీపరు... నీజబ్బ నునుపు జాతి మెరుపు
చేతి వొడుపు పట్టులాంటి పట్టకారు...పట్టకారు ||నీకోసం||
చరణం 2
[అతడు] ప్రేమ కొరకు మళ్ళీ పుట్టి రావాలా...
పొట్టి లాగూ వేసి బళ్ళో చేరిపోవాలా
గోడ కుర్చీ వేసి గుంజీలే తియ్యాలా
కాటన్ బ్రిడ్జి ఎక్కి గోదారిలో దూకాలా
[ఆమె] సింగల్ లెగ్గు కొంగ జపం చెయ్యాలి
నా కోసం మందూ, మాట్క మానుకోవాలి
అటు ఇటు పక్క చూపులు మారాలి
నా జెళ్ళోఅ పిన్నై అంటుకు తిరగాలి...
నా చిలిపి వగలు రేయిపగలు
నిదరమాని కథలు కథలు పొగడాలి.. పొగడాలి...
చరణం 3
[అతడు] నీ నవ్వే దీపావళి క్రాకరు
నా ప్రేమ ప్ల్తెటుకు నువ్వే హైజాకరు
నీ చిట్టి మనసు స్విస్సుబ్యాంకు లాకరు
నువ్వే లేకపోతే అయిపోతా జోకరు
[ఆమె] నీ బంగినపల్లి మ్యాంగో ప్రూటు నేనేరా
నా తియ్యగ ఉండే తిరపతి లడ్డూ నువ్వేరా
నా సిలుకు చీర సిగ్గే నువ్వురా
ఈ బిగుతు రైక పొంగే నీదిరా
లేలేత ఆకూ వక్కా సున్నం
తాంబూలాలు పండే లగ్గం ఇప్పుడేతా... ఇటురారా.....