సినీతార వచ్చిందోయ్ స్వాగతాలు చెప్పండోయ్

పల్లవి

[అతడు] శంభో శంభో సాంబసదా శివ చంద్ర కళాధర సర్వలోకేశ్వరా
నీదయ మాపై చూపరా ఈశ్వరా
[అతడు] ఏయ సినీతార వచ్చిందోయ్ స్వాగతాలు చెప్పండోయ్
సాక్షాత్తు చందమామ చేతికొచ్చిందోయ్
[ఆమె]స్టైలు చూసి మెచ్చేసా పాటవిని వచ్చేసా
రూటు మాట పక్కనెట్టి ఆటకొచ్చెసా
[అతడు] రావమ్మో బుల్లెమ్మో నువ్వు ఆడేది ఎవ్వరితో తెలుసుకోమ్మో
[ఆమె] అబ్బాయో అబ్బాయో నేను తమిళ హీరోలతో ఆడినమ్మాయి
[అతడు] శివకాశి ఆటంటే అదిరిపోవాలా నేను చిందేస్తే శివుడైన ఈలకొట్టాలా
[ఆమె] నేను స్టెప్పేస్తే కుర్రకారు గోలపెట్టాలా

నేను కనుసైగ చేసానో వేడిపుట్టాలా ||సినీతార వచ్చిందోయ్||


చరణం 1


[అతడు] మనిషన్నాక మనసుండాలి ఆదుకునే గుణముండాలి
[ఆమె] నీలా అంత ఆలోచిస్తే లోకమిలా ఎందుకుంటది
[అతడు] అరె కాస్టిఫ్యాన్ కంటె విలువైనది మాగుర్తు పేదొల్లకు ప్రియమైనది
[ఆమె] మోడ్రన్ ఫ్రిజ్‌లు మోటార కంటె ఈ కుండలో వాటర్ ఎంతో మిన్న
[అతడు] నాకెందుకు నీతో గొడవ
[ఆమె] అయితే గురువా ఇస్తా చొరవా
[అతడు] అభిమాన తారవు నీవేనంట మా మనసుల్ని ముద్దుగా గెలిచావంట
[ఆమె] మాటలలో మాయ చేసి మాస్ కుర్రోడ
కొత్తస్టెప్లతో కట్టేసావు నన్ను బుల్లోడు ||సినీతార వచ్చిందోయ్||


చరణం 2


[అతడు] కృష్ణాజిల్లా, ఖమ్మంజిల్లా, ఏజిల్లా ముద్దుబిడ్డవో
[ఆమె] ఇరవై మూడు జిల్లాల్లోన నన్నెరగని వాళ్ళు లేరెమో
[అతడు] సినిమా స్టార్స్ ఓట్లడిగితే గెలుపన్నది మా సొంతం అవుతుందయ్యో
[అతడు] పేదవాళ్ళ మనసు గెలిచారంటే రేపే సి.యమ్ అవ్వచ్చమ్మో
[ఆమె] నచ్చిందయ్యో నీ అభిమానము
[అతడు] ఇక చెయ్యాలమ్మో మా సావాసములు
[ఆమె] ఎవరైనా మంచికి తలవొంచాలా
నలుదిక్కులు నీపేరు మారుమోగేలా
[అతడు] మాపాటి పేదోల్లకు అండవుతుంది
ఈ గెలుపుతో ప్రతి ఇంటికి వెలుగొస్తుందోయ్ ||సినీతార వచ్చిందోయ్||