దేవతకు మారువేషమా కన్నతల్లికే

పల్లవి

[అతడు] దేవతకు మారువేషమా కన్నతల్లికే కాలదోషమా
నా దేవతకు మారువేషమా
మహరాణికింత పేదవేషమా గొడ్డరాలివైతే భాదలేదమ్మ
ఈ కోక్షపాకరాత లేదమ్మ నీ ఇల్లే స్వర్గమనుకుంది
మరి తన ఆశే నరకమయ్యింది భూమాత ఓర్పు తనకుంది
ఇంక ఏ దిక్కు లేకపోయింది

చరణం 1

[అతడు] ఏమి విధి ఏమి విధి రా బంగారు జీవితాన్ని కాలరాసెరా
ఏమి రాత ఏమి రాత రా ఆ బ్రహ్మ చేతగాని రాత రాసెరా
ప్రాణమిచ్చి కన్న కల్పవల్లివే రక్తమిచ్చి పెంచు పాలవెల్లివే అమ్మా ||2||
పస్తులున్న రోజులన్ని పంచకైన చేర్చకుండ సాగనంపు వేళకొచ్చే
పిల్లలెందుకమ్మ నువ్వు కన్నావు ||2||దేవతకు మారు||

చరణం 2

[అతడు] పాశమంటె పచ్చిమోసమో పాడెకట్టగానె తీరుబందమా
బండరాయిలోన స్వామి రూపమా స్వామి గుండెలోన ఇంత ద్వేషమా
రేయి పగలు జోలపాడుతుంటది బిడ్డ సుఖమె అమ్మ కోరుకుంటదీ ||2||
తన పిల్లలన్న ప్రేమ వల్ల తప్పులేవి ఎంచకుండ అమ్మ అన్న పేరులోని
అమృతాన్ని పంచుతుందిరా అమ్మ అమృతాన్ని పంచుతుంది రా
నా దేవతకు మారు వేషమా చిట్టి చెల్లికింత పేద వెషమా
తండ్రి అంతవాడు అన్నదా నేనవ్వరని చెప్పుకోనురా
ఏ బంధం ఇంక నాకుంది లేకుంటే ఇక్కడే ముంది
సంబంధం ఎదలో ఉంది అది ఏనాడు చెప్పలే నంది