చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా

పల్లవి

[ఆమె] చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా||2||
చెట్టులెక్కి ఆ చిటారుకొమ్మన చిగురు కోయగలవా
ఓ నరహరి చిగురు కోయగలవా
[అతడు] చెట్టులెక్కగలనే ఓ చెంచిత పుట్టలెక్కగలనే
ఓ చెంచిత చిగురు కోయగలనే
[ఆమె] ఉరకలేయగలవా! ఓ నరహరి పరుగులెత్తగలవా||2||
ఊడపట్టుకొని జారుడుబండకు ఊగిచేరగలవా ఓ నరహరి ఊగి చేరగలవా
[అతడు] ఉరకలేయగలనే ఓ చెంచిత పరుగులెత్తగలనే
ఊడపట్టుకొని జారుడుబండకు ఊగి చేరగలనే
ఓ చెంచిత ఊగి చేరగలనే


[ఆమె] ఓ...గుఱిని చూసుకొని కనులు మూసుకొని బాణమేయగలవా
ఈ నరహరి బాణ మేయగలవా
[అతడు] గుఱిని చూసి వెనుతిరిగినా నేర్పుగ బాణమేయగలనే ఓ చెంచిత
బాణమేయగలనే ఓ చెంచిత నిన్ను మించగలనే ||చెట్టు||
[ఆమె] ఓ...తగవులేల ఎగతాళి కాదు నన్ను తాళి కట్టనీవా
ఓ చెంచిత తాళి కట్టనీవా
[ఆమె] మనసు తెలుసుకొని మరులు చూపితే మనువునాడనిస్తా
ఓ నరహరి మనువునాడనిస్తా మూలతెచ్చి వేస్తా