పల్లవి
[కోరస్] బోలా రామభక్త హనుమాన్‌కి జై...
ఓం మన్ మన్ మన్ మారుతీ వేగా ఓం తస్‌సత్ పసయోగా
ఓం ఓం మానర వేతా ఓం నమో నమభావ విధాత
రామలక్ష్మణా జానకి జయము జయము హనుమాన్‌కి
భయము భయమురా లంకకి జయ జయ మనరా హనుమాన్‌కి
చింతతీర్చెరా సీతకి జయజయ జయ హనుమాన్‌కి
[అతడు] ఊరేగి రావయ్య హనుమాంజ హనుమా
ఊరేగి చూపించు మహిమ
హే...మాతోడు నీవయ్య హనుమామ హనుమా
మాగోడు గోరంత వినుమా
వాయుపుత్ర హనుమా మావాడ వయ్య హనుమా
భామపుత్ర హనుమ మా రక్షనీవే వినుమా
మమ్ము ఆదుకో రావయ్యా ఆంజనేయ
ఆపదరాయ చూపించరాదయా
మమ్ము ఏలుకో రావయ్యా రాక్షసమాయ
హతమే చెయ్య నీనాడే చాలునయా
||వాయుపుత్ర ||
చరణం 1
[అతడు] బంటువైన నువ్వేల బంధువైన నువ్వేలే బాదలన్ని తీర్చేదిక్కుదైవం నీవేలే
చూసిరారా అంటేనే కాల్చి వచ్చావ్
మంటల్లే జానకమ్మ కంట పలికే హారతీ నీవే
ఎదలోనె శ్రీరాముడంట కనులార కనమంటా
బ్రహ్మచారి మా బ్రహ్మావంటా సరిసాటి ఎవరంట
అహొ...మా సామి నువ్వే హామి ఇస్తుంటే రామ బాణాలు కాపాడేనంట
ఓహొ మా జండాపైన అండై నువ్వుంటే
రామరాజ్యాలు మావే లెమ్మంటా
||మమ్ముఆదు||
చరణం 2
[అతడు] మండుతున్న సూర్యుడ్ని పండులాగ మింగావు
లక్ష్మణున్ని గాచే చెయ్యే సంజీవి మాకు
తోకచిచ్చు వెలిగించి లంకగుట్టే రగిలించి
రావణుడ్ని శిక్షించావు నువ్వే మా తోడు
శివదేహం నీ రూపమంటా భబమాన సుతుడంటా
అంజనమ్మా ఆనందమంతా హనుమాని చరితంటా
పాహి శ్రీరామసీత పల్లకి నువ్వంట నీకు బోగాలు మేమేలెమ్మంటా
జాహి ఆకాశాలైనా కాలని యెదంట కోటి చుక్కల్లు తల్లోపూలంటా
||మమ్ముఆదు||