పల్లవి
[ఆమె] చందమామ రమ్మంది చూడు
చల్లగాలి రమ్మంది చూడు
ఆ పైన ఇంక ఆ పైన
నువ్వు నా కళ్ళలో తొంగిచూడు
[అతడు] చందమామ బాగుంది నేడు
చల్లగాలి బాగుంది నేడు
ఏముంది ఇంక ఏముంది
ఇంతేకదా ఈనాడు
చరణం 1
[ఆమె] పువ్వులే ఎందుకో నవ్వుతున్నాయి చూడు
వెన్నెలే ఎందుకో నన్ను కవ్వించే నేడు
తెలుసుకోలేవు నూవూ తెలుపగాలేను నేను ||చంద||
[అతడు] పువ్వులే నవ్వితే నవ్వుకోనిమ్ము నేడు ||2||
నువ్విగ వెన్నెల ఎందుకమ్మాయి తోడు
నీది నా దారికాదు నాది నీదారికాదు ||చంద||
చరణం 2
[ఆమె] చెంతగా నిలిచినా ఇంత గిలిగింతలేదు ||2||
[అతడు] చెంతగా నిలిచినా వింత నాకేమీలేదు
[ఆమె] అడివి మనిషివి నీవు
[అతడు] అ మాట తగదన్నాను ||చంద||