పల్లవి
పాడవోయి భారతీయుడా
ఆడి - పాడవోయి విజయగీతిక
నేడే స్వాతంత్ర్యదినం - వీరుల త్యాగఫలం
నేడే నవోదయం - నీదే ఆనందం ||పాడ||
చరణం 1
స్వాతంత్ర్యం వచ్చెననీ సభలే చేసి
సంబరపడగానే సరిపోదోయి
సాధించినదానికి సంతృప్తిని చెంది..
అదే విజయమనుకుంటే పొరబాటోయి
ఆగకోయి భారతీయుడా
కదలి సాగవోయి ప్రగతిదారులా ||ఆగ||
చరణం 2
ఆకాశం అందుకునే ధరలొకవైపు
అదుపులేని నిరుద్యోగం మింకొకవైపు
అవినీతి బంధు ప్రీతి చీకటిబజారు
అలుముకొన్న నీదేశం ఎటు దిగజారు
కాంచవోయి నేటి దుస్థితి
ఎదిరించవోయి ఈ పరిస్థితి ||కాం||