ఇది ఒక ఇది ఒక నవలోకం

పల్లవి

[అతడు] ఇది ఒక ఇది ఒక నవలోకం ఇద్దరి ప్రేమకు శ్రీకారం
మనసులు కలిసిన ఈ సమయం ఆనందానికి తొలి ఉదయం
వరమో వశమో ప్రేమే జగమో సుభమో సుఖమో మదిసంబరమో
[ఆమె] ఇది ఒక ఇది ఒక నవలోకం ఇద్దరి ప్రేమకు శ్రీకారం
మనసులు కలిసిన ఈ సమయం ఆనందానికి తొలి ఉదయం
కలివై కలసి కధ మార్చావు మెరుపై మెరసి నను తాకావు

చరణం 1


[ఆమె] కుదురంటు లేకుంది మనసుకు నిదురంటు రాకుంది ఎందుకు
[అతడు] అందర్ని చూస్తున్నాను వింతగా చుక్కల్ని లెక్కేస్తున్నా కొత్తగా
సరదాగా మొదలైన ఈ ప్రయాణం మొత్తంగ ప్రేమాయణం
ఎటు చూస్తున్నా ఏదో లోపం అటుమిదుంటే తెగ సంతోషం ||ఇది ఒక ఇది ఒక||


చరణం 2


[అతడు] చంద్రుడు చేతికి అందినా మబ్బులు మాటలు నేర్చినా
[ఆమె] పూవులు పాటలు పాడినా కొండలు నాట్యము ఆడినా
ఏ బ్రహ్మ సృష్టించాడో ప్రేమగాని జగమంతా వింతగుంది నేడు
ఎటు చూస్తున్నా అటు అద్భుతమే మాయలు చేసే మరిసంబరమే ||ఇది ఒక ఇది ఒక||