చెంగావి రంగుచీర కట్టుకున్న చిన్నది

పల్లవి

[అతడు] చెంగావి రంగుచీర కట్టుకున్న చిన్నది
దాని జిమ్మదియ్య ||2||
అందమంతా చీరలోనే వున్నది
[ఆమె] చెంగావి రంగుచీర కట్టుకున్న చిన్నది
దాని జిమ్మదియ్య ||2||
కొంగుకొంగు కలిపిచూడమన్నది
||చెం||

చరణం 1

[అతడు] మెరుపల్లె వచ్చింది నా యింటికి
నన్ను మెల్లంగా దింపింది ముగ్గులోనికి
[ఆమె] తలదాచుకొమ్మని తావిస్తివి
పిల్లదొరికిందెచాలని ఇల్లాల్ని చేస్తివి
||చెం||

చరణం 2

[అతడు] ప్రేమంటే నేర్పింది పిల్లవాడికి
దాంతో - వెర్రెత్తిపోయింది కుర్రవాడికి
[ఆమె] పిచ్చివాడనే పేరుమాటునా మాటువేసిణావు
చిన్నదాని పెదవిమీదా కాటువేసినావు

చరణం 3

[ఆమె] సరసంలో పడ్డాడు ఇన్నాళ్ళకి
అబ్బా - సంగీతం వచ్చింది బుచ్చిబాబుకి
[అతడు] తెరచాటు తొలగించి పరువానికి
అది పరవళ్ళు తొక్కుతూ పాడింది నేటికి
||చెం||