పల్లవి
[అతడు] ఓఓ చిగురాకులలో చిలకమ్మ
చిన్నమాట వినరావమ్మా
[ఆమె] ఓఓ...మరుమల్లెలలో మామయ్యా
మంచిమాట సెలవీవయ్యా
చరణం 1
[అతడు] పున్నమి వెన్నెల గిలిగింతలకు పూచిన మల్లెల మురిపాలు
నీ చిరునవ్వుకు సరికావమ్మా ||ఓ||
[ఆమె] ఎవరన్నారో ఈ మాట వింటున్నాను నీ నోట
తెలిసి తొలికిణి వినువేళా ||ఓ||
చరణం 2
[అతడు] వలపే కోమలి వయ్యారాలకు తలపే మనసుల తియ్యదనాలకు
కలవారి విలువలు సెలవియ్య ||ఓ||
[ఆమె] పై మెరుగులకే భ్రమపడకయ్య మనసే మాయని సొగసయ్యా
గుణమే తరగని ధనమయ్యా ||ఓ||