[ఆమె] నేడు శ్రీవారికి మేమంటే పరాకా
తగని బలేచిరాజా - ఎందుకో తగని బలేచిరాకా
||నే||
చరణం 1
[ఆమె] మొదలు మగవారు వేస్తారు వేషాలు
పెళ్ళీకాగానే చేస్తారు మోసం
[అతడు] ఆడవాళ్ళంటే శాంత స్వరూపాలే
కోపతాపాలే రావండి పాపం
[ఆమె] కోరి చేరిన మనసు చేత చిక్కిన అలుసు
కొసకు ఎడబాటు అలవాటు చేస్తారు
[అతడు] నేడు శ్రీమతికి మాతోటి వివాదం - తగనీ
బలే వినోదం - ఎందుకో - తగని బలే వినోదం
[ఆమె] వారి మనసైతే వస్తారు ఆడవారు
చేర రమ్మంటే రానేరారు
[ఆమె] తెలుసుకున్నారు స్త్రీల స్వభావాలు
తెలిసి తీర్చారు ముద్దు మురిపాలు
[అతడు] అలుక సరదా మీకు అదే వేడిక మాకు ||2||
కదకు మురిపించి గెలిచేది మీరేలే
ప్రణయ కలహాల సరసాలె వినోదం నిజమె
బలే వినోదం - నిజమే బలే వినోదం