రఘుకులరాఘవ రాజారాం - హే
పరమదయాకర సీతారాం
వేదవేదాంతముల సారమునీవే
ఇహపరసౌఖ్యాలనిచ్చుమహాత్మా
భాగ్యవంతులకు కలలోనైన
కనిపించడురా కరుణా మయుడు
నీతి నిజాయితీగల బీదలను
శ్రీపతి ఎప్పుడు మరువడురా
ఆ అమ్మ చూపులలో అనురాగము ఒల్కునులే
భరత భూదేవి కన్న బిడ్డలకు
సేవలు సల్పెడి మార్గము చూపగరారా
సత్యాన్ని చాటించి, భువిశాంతిని చేకూర్చే
ప్రజాశక్తులకు దేశభక్తులకు
ప్రేమస్వరూపా దర్శనమీయగరారా