రామనామమను మిఠాయి ఇదిగో

రామనామమను మిఠాయి ఇదిగో
రండి సుజనులారా!
హల్వాజిలేబి కోవా వగైరా
అంగలార్పుకేనండీ
తారకనామం - తనివిగ మెక్కితే
తరతరాలకూ - నోరూరునండి