వినరయ్యా! శ్రీరామునిగాధ
కనరయ్యా! రఘురామిని లీల
వినరయ్యా! రామగాధ
కనరయ్యా! రామలీల
తండ్రియా నతిని సపసివెంటజని
పరిమార్చెను మాయావి తాటకిని
మారీచ సుబాహుల మదమడచి
విశ్వామిత్రుని యాగముగాచె
||వినరయ్యా||
శాపవశముచే శిలయైయున్న
సాధ్వి అహల్యను నాతిగజేసె
దుష్టులైన రాక్షసులను దునిమి
మునిజనులకు కడుమోదముకూర్చె
||వినరయ్యా||
శిరమువంచి సీతమ్మ సిగ్గున
బెదరు చూపులతో రాముని చూడ
సతి భావముగని సంతస మంది
మందహాసమున మన్ననచేసె
||వినరయ్యా||