పదహారణాల తెలుగు జూలియెట్‌ ఎక్కడ ఉందో వెతుకుదాం

పల్లవి

[అతడు] We have a Romeo we need a Juliet ||2||
ఏ... పదహారణాల తెలుగు జూలియెట్‌ ఎక్కడ ఉందో వెతుకుదాం
పదరా మనవాడి చిలిపిలైఫ్‌నే ఎక్కడ ఉన్నా కలుపుదాం
కులమేదైనా ఫికర్ లేదు తల ఉంటే సరే
మతమేదైనా దిగుల్ లేదు మనసుంటే సరే సరే
సినీతారో టెన్నిస్ స్టారో నచ్చేదిక నీకెవరో ||We have||


చరణం 1


[అతడు] చదువుల సుందరి అదిగోరా
నడిచే లైబ్రరీ ఎందుకురా
సెల్‌ఫోన్ సొగసరి ఇదిగోరా
ఎప్పుడు ఎంగేజేరా
టి. వి. యాంకర్‌ దేఖోరా ఉత్తర భాషకు దండంరా
టాటా గారి బేటిరా అది రూపిగుమ్మరా
ఏంకావాలో మనలో క్వాలిటి
ఇంకా నీలో లేదోయ్ గ్యారంటి
తేల్చేలోగా వయసవుతుంది కనీసం నూటొకటి ||We have||


చరణం 2


[అతడు] అందరు గమనిస్తూ ఉంటే ఏమండి అని పిలవాలి
ఎవ్వరు పక్కన లేకుంటే ఏరా అనాలి
అల్లరి వేషం వేస్తుంటే తలపై ఒక్కటి ఇవ్వాలి
అలసట కాని వస్తుంటే తలనే నిమరాలి
కొంచెం కోపం కొంచెం జాలి కొంచెం స్వార్థం కలిసుండాలి
నన్నేనాడు కొత్తగా చూపే యువరాణే కావాలి ||We have||