పల్లవి
[అతడు] అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చెలి
అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే
మరి కలవో అలవో వరమో నా ఊహల హాసిని
మదిలో కధగా మెదిలే నాకల సుహాసిని
ఎవరేమనుకున్నా నా మనస్సందే నువ్వేనేనని ||అప్పుడో ||
చరణం 1
[అతడు] తీపికన్నా ఇంకా తియ్యనైనా నేనే ఏది అంటే వెంటనే నీ పేరని
అంటానే
హాయి కన్నా ఎంతో హాయిదైనా చోటే ఏమిటంటే నువ్వు వెళ్ళేదారని
అంటానే
నీలాల ఆకాశం ఆనీలం ఏదంటే నీ వాలు కళ్ళల్లో ఉందని
అంటానే ||అప్పుడో ||
చరణం 2
[అతడు] నన్ను నేనే చాలా తిట్టుకుంటా నీతో సూటిగా ఈ మాటలేమి చెప్పక
పోతుంటే
నన్ను నేనే బాగా మెచ్చుకుంటా ఏదో చిన్నమాటే నువ్వు నాతో
మాట్లాడావంటే
నాతోనే నేనుంటా నీతోడే నాకుంటే ఏదేదో అయిపోదా నీ జత
నాకుంటే ||అప్పుడో ||