శ్రీరామ నీనామమెంతో రుచి - ఎంతో రుచిరా!
ఓ రామ నీ నామ నీ నామ మెంతో రుచిరా
ఎంతో రుచి - ఎంతో రుచి - ఎంతో రుచిరా
||శ్రీరామ||
పాలు మీగడల గన్న - పంచదార చిలకల కన్న
||శ్రీరామ||
తప్పులు చేయుట మావంతు - దండన పొందుట
మావంతు - యమ దండన పొందుట మా వంటు
పాపం చేయుట మా వంతు - దయ చూపించడమే నీ వంతు
||శ్రీరామ||
రాతినే యిల నాతిగ మార్చి - కోతికే పలునీతులు నేర్పి
మహిమలెన్నో చూపిన దేవా - మము బ్రోవ రాలేవా
||శ్రీరామ||
పవమానసుతుడు బట్టు నీ పాదారవిందములకు
నీ నామ రూపములకు నిత్యజయ మంగళం